తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,876 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా మరో 7,432 మంది కోలుకున్నారని పేర్కొంది. నిన్న 70,961 టెస్టులు చేయగా.. 6,876 కేసులు రికార్డయ్యాయని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,029, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 502, రంగారెడ్డి జిల్లాలో 387 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,63,361కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,81,365 మంది కోలుకున్నారు. మొత్తం వైరస్ బారినపడి 2,476 మంది ప్రాణాలు విడిచారు. మరణాల రేటు 0.53 శాతం ఉండగా.. రికవరీ రేటు 82.30శాతం ఉందని ఆరోగ్యశాఖ వివరించింది.