Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

XBB variant గురించి అసలు సంగతి చెప్పిన కేంద్రం.. మార్గదర్శకాలివే

covid19 virus
, గురువారం, 22 డిశెంబరు 2022 (20:06 IST)
చైనాలో  నాలుగో వేర్త్ మొదలైందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్ పట్ల రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా కేంద్రం రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ అసవాస్తవాలను నమ్మవద్దని పేర్కొంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో xxb అనే కోవిడ్ -19 కొత్త వేరియంట్ పట్ల అసత్యపు ప్రచారం సాగుతోంది. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదారి పట్టిస్తాయని పేర్కొంది. 
 
ఇంకా xxbవేరియంట్ మార్గదర్శకాలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 
 
అవేంటంటే.. 
మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. 
xxb వేరియంట్‌ను నయం చేయడం అంత సులభం కాదు. 
 
xxb వేరియంట్ లక్షణాలు..
1. దగ్గు వుండదు
2. జ్వరం వుండదు 
3. కీళ్ల నొప్పులు వుంటాయి. 
4. తలనొప్పి వుంటుంది. 
5. మెడపై భాగంలో నొప్పి వుంటుంది. 
6. న్యుమోనియా
 
కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్ఎక్స్‌బీ డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకరమైనది. xxbని కనుగొనడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ వేరియంట్ లక్షణాలు అంత తేలికగా బయటపడవు. అందుకే కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. 
 
xxb నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాసప్రక్రియకు ప్రమాదకారి. కొన్ని సందర్భాల్లో కోవిడ్ టెస్టుల్లోనే ఈ వేరియంట్‌ను కనుగొనడం కష్టమవుతుందని వైద్యులు చెప్తున్నారు.
 
అందుచేత అధిక జన సంచారం వున్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. సామాజిక దూరం పాటించడం, డబుల్ లేయర్ మాస్క్‌లు తప్పనిసరి, చేతులను శుభ్రంగా వుంచడం, జలుబు, దగ్గు వుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరంగల్‌లోని అభిమానుల కోసం ఉత్సాహపూరితమైన ఆఫర్లు ప్రకటించిన కల్యాణ్ జ్యువెలర్స్