Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 703 మంది కరోనా బాధితులు మృతి - కొత్తగా 3.47 లక్షల కేసులు

దేశంలో 703 మంది కరోనా బాధితులు మృతి - కొత్తగా 3.47 లక్షల కేసులు
, శుక్రవారం, 21 జనవరి 2022 (10:01 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 703 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా కొత్తగా 3.47 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం వెల్లడైన కేసులతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 29,722 అధికం. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 మందికి ఈ వైరస్ సంక్రమించింది. అలాగే, 2,51,777 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 20,18,825గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. అదేవిధంగా దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 9692కు చేరుకున్నాయి. నిన్నటితో పోల్చితో ఈ కేసుల సంఖ్య 4.36 శాతం అధికం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలకు షాకివ్వనున్న తెలంగాణ సర్కారు.. మరోమారు చార్జీల బాదుడు