ఓ కారు డీలర్‌షిప్ యజమాని కోవిడ్ రోగి నుంచి కొన్న లాలా జలంతో తన ఉద్యోగిని చంపేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్నేయ టర్కీలోని అదానాకు చెందిన ఇబ్రహీం ఉన్వర్డి, తనకు వైరస్ సోకడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ మూడేళ్లుగా తన కోసం పనిచేసిన ఉద్యోగిపై క్రిమినల్ ఫిర్యాదు చేశాడు.
కారు అమ్మిన తరువాత ఉర్వేండి అతనికి 215,000 టర్కిష్ లిరాను (రూ .22 లక్షలు) ఇచ్చి, ఆ డబ్బును కార్యాలయానికి తీసుకెళ్లమని కోరాడు. కానీ పూర్తిగా విశ్వసించిన తనను యజమాని మోసం చేశాడని వాపోయాడు.
మాజీ ఉద్యోగి డబ్బును దోచుకోవడమే కాకుండా COVID-19 రోగి యొక్క లాలాజలంతో తనకు పానీయంలో కలిపి ఇచ్చేందుకు ప్రయత్నించాడని.. అదృష్టవశాత్తూ, ఆ పానీయాన్ని తీసుకోలేదన్నాడు. మాజీ బాస్ తనను చంపేందుకు కోవిడ్ -19 రోగి నుండి 500 టర్కిష్ లిరా (రూ. 5,000) కు లాలాజలం కొని, దానిని తన పానీయంలో కలపడానికి ప్రయత్నించాడు.
తోటి ఉద్యోగులలో ఒకరి నుండి ఈ విషయం తెలుసుకున్నానని ఉర్వేండి చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులకు ఉర్వేండి ఫిర్యాదు చేశాడు. ఇదో వింత ప్రయత్నమని.. ఎలాగో ఈ దుర్ఘటన నుంచి తాను తప్పించుకున్నానని.. దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.