దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఆదివారంనాడు టర్కీలో 55,802 కొత్త కేసులు, అమెరికాలో 43,174, బ్రెజిల్‌లో 42,937, ఫ్రాన్స్‌లో 29344, ఇరాన్ 21,644 కేసులు నమోదవగా, మహారాష్ట్రలో మాత్రం రికార్డుస్థాయిలో 68,531 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 503కి చేరింది. మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు కరోనాతో మృతి చెందుతున్నారు. ఒక గంటలో సుమారు మూడు వేల మందికి కరోనా సోకుతుంది.
24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్యతో మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా మారుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మృతుల రేటు 1.58 శాతంగా ఉంది. గతంలో 90 శాతానికిపైగా ఉన్న రికవరీ రేటు 80.92 శాతానికి పడిపోయింది. ప్రతి మూడు నిమిషాలకు ఒక కరోనా మృతి చోటుచేసుకుంటోంది.