Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూలు వైద్య కాలేజీలో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్

Advertiesment
కర్నూలు వైద్య కాలేజీలో కరోనా కలకలం - 15 మందికి పాజిటివ్
, సోమవారం, 10 జనవరి 2022 (11:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ కాలేజీలోని అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 15 మందికి ఈ పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఇందులో 11 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతుంటే, నలుగురు హౌస్ సర్జన్ విద్యార్థులు. అలాగే, మరో 40 మంది విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనాశాలకు పంపించారు. వైద్య కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఈ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలతో పాటు.. 9 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే, ఈ స్టేషన్‌లోని మిగిలినవారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో భార్యల మార్పిడి సెక్స్ రాకెట్ - టెలిగ్రామ్ గ్రూపు ద్వారా అనుసంధానం