Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020ని కరోనా మింగేస్తుందా? కెన్యా కీలక నిర్ణయం.. ఏంటది?

Advertiesment
Kenya
, మంగళవారం, 7 జులై 2020 (22:04 IST)
2020 సంవత్సరాన్ని కరోనా మింగేసేలా వుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. కెన్యా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యంతో పాటు ఇతర దేశాలు కరోనాను తరిమికొట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ.. కరోనాను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఫలితంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. 
 
2021లో మళ్లీ స్కూల్స్ తెరవనున్నట్లు ప్రకటించింది. కెన్యా విద్యా శాఖ కేబినెట్ సెక్రటరీ ప్రొఫెసర్ జార్జ్ మగోహా ప్రకటించారు. కెన్యాలో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్కూల్స్ తెరవడం శ్రేయస్కరం కాదని మగోహ తెలిపారు. 
 
విద్యా సంవత్సరం వృధా అవుతుందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదని..  అయితే.. ఈ విద్యా సంవత్సరంలో ఏ క్లాస్ చదువుతున్నారో.. 2021లో మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో కెన్యాలో మార్చి 15 నుంచి స్కూల్స్ మూతపడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికంగా వర్తకం చేసిన బెంచిమార్కు సూచీలు, 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్