Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీలకు వ్యాక్సిన్ లేదు.. స్వల్పంగా జ్వరం, ఆ ప్రాంతంలో నొప్పి వుంటుంది..

గర్భిణీలకు వ్యాక్సిన్ లేదు.. స్వల్పంగా జ్వరం, ఆ ప్రాంతంలో నొప్పి వుంటుంది..
, శుక్రవారం, 15 జనవరి 2021 (10:25 IST)
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మన దేశంలో జరగనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్‌ ఒకే కంపెనీకి చెందినదై ఉంటుంది. రెండు కంపెనీల వ్యాక్సిన్ ఒక వ్యక్తికి ఉపయోగించరు. కాగా గర్భవతులకు, బాలింతలకు ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేయరు. 
 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన విధివిధాలను పంపింది. దీనితో పాటు కోవిషీల్డ్‌కు సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్ కూడా జతచేసింది. ఈ ఫ్యాక్ట్‌షీట్‌లో వ్యాక్సినేషన్ డోసు, కోల్డ్ స్టోరేజ్ మొదలైన వివరాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానిలో తెలియజేశారు.
 
మరోవైపు కరోనా టీకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచంలో కరోనా టీకా కారణంగా కొద్దిమందిలో సైడ్‌ఎఫెక్ట్‌లు కనిపించిన కారణంగా చాలామంది టీకా వేయించుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగి, ఇటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
 
కరోనా టీకా వలన నపుంసకులు అవుతారంటూ వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్థన్ ఖండించారు. ఇటీవల ఒక రాజకీయ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి వివరణ ఇచ్చిన హర్షవర్థన్... కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదని, అటువంటి ఆధారాలు కూడా లేవని అన్నారు. నిరాధానమైన ఇటువంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
అయితే కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా నుంచి పావురం.. 13వేల కి.మీ ఎగురుతూ వచ్చింది.. చంపేయాలని..?