కరోనావైరస్ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతుల సంఖ్య 25వేలు దాటింది. ఇక్కడ ప్రతి గంటకు ఆరుగురు చొప్పున మరణిస్తున్నారు.
ఇకపోతే అమెరికాలో న్యూయార్క్ సిటీలో మరణాల సంఖ్య 38వేలకు చేరుకుంది. టెక్సాస్ 27వేల మంది చనిపోయారు. కరోనావైరస్ బాధితులకు ఆస్పత్రుల్లో పడకల దొరకడంలేదు. ఆసుపత్రుల ముందు అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. రోగిని ఆసుపత్రిలో చేర్చేందుకు కనీసం 8 గంటల సమయం పడుతోంది.
ఈలోపు కొందరి పరిస్థితి తీవ్రతరంగా మారుతోంది. దీనితో అంబులెన్సుల్లోనే వైద్యం అందిస్తున్నారు. ఇంకోవైపు డిశ్చార్జ్ అయినవారు తమకు ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటూ ఇంటికి తీసుకుని వెళ్తుండంతో ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఇదిలావుంటే కరోనావైరస్ కొత్త రూపు దాల్చడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువవుతోంది.