Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిషీల్డ్ ప్లస్ కోవ్యాక్సిన్ వేసుకున్న నో ప్రాబ్లమ్ : ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ

Advertiesment
కోవిషీల్డ్ ప్లస్ కోవ్యాక్సిన్ వేసుకున్న నో ప్రాబ్లమ్ : ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ
, గురువారం, 1 జులై 2021 (10:05 IST)
కరోనా వైరస్ సోకకుండా, ఒక వేళ సోకినా ప్రాణాపాయం కలగకుండా ఉండేందుకు వీలుగా వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఒక వ్యాక్సిన్ మాత్రమే వేసుకోవాలా లేదా రెండు వ్యాక్సిన్లు వేసుకోవాలా అన్నదే ఇపుడు ఓ సందేహంగా మారింది. అలాగే, రెండు వేర్వేరు టీకాలు తీసుకోవచ్చా? అన్న దానిపై చాలా రోజులుగా అందరికీ అనుమానాలు ఉన్నాయి. 
 
కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ కొవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్ తీసుకున్న ఘటనలు కూడా జరిగాయి. తాజాగా యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో రెండు వేర్వేరు టీకాలను తీసుకున్నా సమస్య లేదని తేలింది. పైగా కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుందని సైంటిస్టులు గుర్తించారు. 
 
అయితే శాస్త్రవేత్తలు స్టడీ చేసిన టీకాల్లో కొవాగ్జిన్ లేదు. యూకేలో ఫైజర్, కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్లలో ఒకటి మొదటి డోసు, మరొకటి రెండు డోసు తీసుకుంటే యాంటీబాడీల ఉత్పత్తి ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేశారు. దానికి సంబంధించిన ఫలితాలను లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. 
 
ఫైజర్ లేదా కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకుని, ఈ రెండింటిలో మరో వ్యాక్సిన్ ను రెండో డోసుగా తీసుకోవడం ద్వారా, రెండు డోసులు ఒకే వ్యాక్సిన్ తీసుకున్న దానితో పోలిస్తే మరిన్ని యాంటీబాడీలు జనరేట్ అవుతాయని ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్, లీడ్ సైంటిస్ట్ మాథ్యు స్నేప్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెస్ట్‌హౌస్‌లో గుట్టుగా వ్యభిచారం... పది మంది యువతులకు విముక్తి