ప్రపంచ దేశాలకు వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం స్పానిష్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు సింహాలకు సోకింది. బార్సిలోనా జంతు ప్రదర్శన శాలలోని నాలుగు సింహాలను పరీక్షించగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పశువైద్యాధికారులు చెప్పారు. జాలా, నిమా, రన్ రన్, కింబే అనే నాలుగు సింహాలలో కరోన వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించామని జూపార్కు కీపర్లు చెప్పారు.
సింహాలకు కరోనా సోకడంతో జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. దీంతో జూపార్కు ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది.సింహాలకు జూ సిబ్బంది ద్వారానే కరోనా సోకిందని తేలింది.
ఏప్రిల్ నెలలో న్యూయార్కులోని బ్రోంక్స్ జూపార్కులో మూడు పులులు, నాలుగు సింహాలకు కరోనా సోకినా అవి కోలుకున్నాయి.అక్టోబరులో యూఎస్ టేనస్సీలోని జూలో పిల్లలతో సహా పులికి వైరస్ సోకింది. కరోనా సోకిన సింహాలకు పశువైద్య సంరక్షణ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.