అవును ఇది ముమ్మాటిటికీ నిజం.. ఛానల్ కవరేజ్ కోసం వాడుతున్న లోగోలు కరోనాను మోసుకొస్తాయి అని చెప్పడంలో సందేహామే లేదు. ఇది యదార్థం కూడా. కానీ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్‌కు, మాట్లాడే వారికి ప్రమాదమే.
ఎందుకో చూద్దాం.
వివిధ చానళ్లు లోగోలు ప్రతి రిపోర్టర్‌కు ఇస్తారు. మేజర్ సెంటర్‌లలో ప్రతి రోజూ 10 స్పాట్‌లు, రెండు లైవ్‌లు ఉంటాయి. నియోజకవర్గ పరిధిలో స్పాట్ నిత్యం వుండే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎక్కువ స్పాట్ కవరేజ్‌లు ఉంటాయి.
ఈ కవరేజ్ వాయిస్, బైట్, లైవ్ కోసం లోగో మైక్‌ను ఉపయోగిస్తున్నారు. ఆలోగో మైక్ బైట్ కోసం ఇతరుల ముందు పెట్టినప్పుడు వారు మాట్లాడేప్పుడు తుంపర్లు లోగోలోకి వెళ్లి పోతాయి. అదే మైక్‍ను మరొకరి దగ్గరో, లేక జర్నలిస్ట్ లైవ్ కానీ ఎండ్ వాయిస్ ఓవర్ పిటూసి చెప్పాల్సి వచ్చినప్పుడు అవి జర్నలిస్ట్ శరీరంలోకి మహమ్మారి కణాలు చేరి కరోనా సోకే అవకాశం ఎక్కువగా వుంది.
మైక్‌ను మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రొటెక్షన్ మార్గాలు లేవు. ఒకవేళ నిత్యం శానిటైజ్ చేస్తే మైక్‌లోకి శాని టైజ్ వెళ్లి పాడైపోతాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో జర్నలిస్ట్ నిత్యం పోరాటం చేయాల్సి ఉంది. కరోనా ఎవ్వరికి ఉందొ లేదో మనకు తెలియదు.
సీఈఓ, ఎడిటర్ వాయిస్ కావాలంటేనో, లైవ్ కావాలంటే మనం ఉరుకులు, పరుగులతో పరిగెత్తుతాము. మనం ఇవ్వన్నీ ఆలోచించే టైం ఉండదు. పోనీ మేజర్ సంఘటనలు జరిగినప్పుడు ఇంతే ఆ సంఘటన కవర్ చేసే విషయం ఆలోచిస్తాము గాని లోగో మైక్ మీద అంత శ్రద్ధ పెట్టె టైం ఉండదు.. ఇప్పటికైనా జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా వవ్యహరించండి లేదా విలువైన మన జీవితాలు నష్టపోవాల్సి వస్తుంది.