కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు పేర్కొన్నారు.
"తేలికపాటి లక్షణాలు కనిపించగా ఈ రోజు పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలింది" అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అలాగే, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,723కి పెరిగింది. కోరనా వల్ల ఒక్క రోజు వ్యవధిలో 146 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 46569 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే కరోనా పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.