Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో మరో 4213 పాజిటివ్ కేసులు - సాయుధ దళాలను వణికిస్తున్న కరోనా

దేశంలో మరో 4213 పాజిటివ్ కేసులు - సాయుధ దళాలను వణికిస్తున్న కరోనా
, సోమవారం, 11 మే 2020 (10:12 IST)
దేశంలో మరో 4213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67152కు చేరాయి. తాజాగా విడుదలైన కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 4,213 మందికి కొత్తగా కరోనా సోకినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, గత 24 గంటల్లో భారత్‌లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,206కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 67,152కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,917 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 44,029 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, భారత పారామిలిటరీ బలగాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు పారా మిలిటరీ దళాల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 750కి పెరిగింది. ఆఖరికి ఎన్ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) దళంలోనూ ఆదివారం తొలి కేసు నమోదైంది.
 
ఇప్పటివరకు ఆయా దళాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను పరిశీలిస్తే, బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో కొత్తగా 18 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 276కి చేరింది. 
 
ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్)లో 56 కొత్త కేసులు వెల్లడి కాగా, మొత్తం కేసుల సంఖ్య 156కి పెరిగింది.  సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)లో 236, సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్ బీ)లో 18, సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం)లో 64 కేసులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టుకున్న భర్త వుండగా ప్రియుడు అవసరమా?