Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ 19 దశాబ్దాల పాటు ఉంటుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

కోవిడ్ 19 దశాబ్దాల పాటు ఉంటుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
, శనివారం, 1 ఆగస్టు 2020 (16:07 IST)
కరోనా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధానోమ్ పలు విషయాలు వెల్లడించారు. కరోనా ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగుతుందని తెలిపారు. చైనాలో కరోనా గురించి ప్రపంచానికి తెలిసి 6 నెలలు గడిచినా, చైనా వెలుపల మరణాలు లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు.
 
ఇలాంటి వైరస్‌లు 100 ఏళ్లలొ ఒకసారి వెలుగు చూస్తాయన్నారు. అలాగే వాటి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని తెలిపారు. కరోనావైరస్ విషయంలో శాస్త్ర సంబంధమైన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని, ఈ విషయంలో ఇప్పటికి ఎన్నో వాటికి సమాధానం దొరికిందన్నారు.
 
చాలామందికి వైరస్ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని, ప్రజలు వాటి బారిన పడకుండా అప్రమత్తంగా వుంటూ ఎదుర్కోవాలన్నారు. కరోనా సోకి తగ్గుముఖం చెందిన ప్రాంతాలలో మరలా సోకే అవకాశముందన్న అంశం అధ్యయనంలో తేలిందన్నారు. మొదట కరోనాకు పెద్దగా గురికాని దేశాలలో మరలా వీటి ప్రభావం ఉందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ సమయంలో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసిన వస్తువు ఏంటి?