Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona: ఆ ఆయుర్వేద మందుతో క్రిటికల్ పేషెంట్ కూడా లేచి కూర్చుంటున్నారు, ఎక్కడ?

Advertiesment
Coronavirus: Even the critical patient
, బుధవారం, 19 మే 2021 (19:52 IST)
పెను సంచలనం. ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...??? దీనికి సంబంధించి వైరల్ అవుతున్న పూర్తి వార్త మీకోసం.
 
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది. కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCANలో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.

సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా కృష్ణపట్నం పైకి మళ్ళింది.
ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంతవరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణపట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
 
ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసినా ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానం అని అనడం అతిశయోక్తి కాదు.
 
"కృష్ణపట్నంలో కరోనాకు మందు పంపిణీపై కాకాణి స్పందన".
 
కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. బొణిగి ఆనందయ్య, తన మిత్రులతో అందిస్తున్న ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో మందులు అందిస్తున్నారు.
 
ఆనందయ్య అందిస్తున్న మందు వల్ల వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప, ఎక్కడా దుష్ప్రభావం చూపలేదు. ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త, జిల్లా అధికారులను వివరణ కోరడం జరిగింది.
 
అధికారులు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ, లోకయుక్తకు నివేదిక అందించేందుకు, మందును పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పిన మీదట, మందు యొక్క ప్రభావం పరిశీలించుటకు గడువు కోరడమైనది. జిల్లా కలెక్టర్ గారు, ఆయుష్ మరియు ఇతర అధికారులతో సంప్రదించాం.
 
వీలైనంత త్వరలో  24 గంటలలోపే మందు యొక్క ప్రభావంపై పరిశీలన పూర్తిచేయవలసినదిగా కోరాం. కరోనా నివారణలో భాగంగా, మందు పరిశీలన పూర్తయిన వెంటనే, ప్రజలెవ్వరికీ అసౌకర్యం కలగకుండా, భౌతిక దూరం పాటిస్తూ, ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు పంపిణీకి త్వరలోనే చర్యలు చేపడుతాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్‌ విద్యార్థి అదుర్స్ - 'ట్రేస్ చాట్'కు గ్లూగుల్ ప్లే స్టోర్ ఆమోదం