దేశాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాలు కోవిడ్ మహమ్మారిని అడ్డుకునేందుకు వీధివీధినా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ అగ్ర భాగాన వుంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుంది. తదుపరి తమిళనాడు రాష్ట్రం వున్నది.
ఈ మూడు రాష్ట్రాలు కరోనావైరస్ అనుమానుతుల సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి. ఐతే తెలంగాణ మాత్రం పరీక్షల విషయంలో అట్టడగున వున్నది. మొదటి మూడు స్థానాల్లో వున్న రాష్ట్రాల మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా పరీక్షల విషయంలో వేగంగా వుండాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి.