తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ మూడు అంకెల కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. తాజగా బుధవారం ఒక్క రోజునే 129 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3020 చేరింది.
తాజాగా బుధవారం నమోదైన 129 కేసుల్లో 108 కేసులు హైదరాబాద్ నగర పరిధిలో నమోదైనవే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిసరాల్లో పర్యటించాలంటే మంత్రులు, అధికారులు హడలిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్యక్రమాలు వద్దని చెబుతున్నారు మంత్రులు.
మొన్న అడిక్‌మెట్‌లో పర్యటన నిర్వహించిన నగర మేయర్ బొంతు రామ్మెహన్, లలితా నగర్ టీ సెంటర్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో టీ తాగారు. అయితే అక్కడ టీ దూకాణంలో పనిచేసే వర్కర్‌కి కరోనా పాజిటివ్ రావడంతో కరోనా తమకెక్కడ సోకుతుందో అని వణికిపోతున్నారు.