వంటగ్యాస్ ఆదా చేయాలంటే..!?
, శనివారం, 12 మే 2012 (16:35 IST)
వంటగ్యాస్ ధర చాలా భారమైపోయింది. కనుక గృహిణి పొదుపుగా గ్యాస్ వాడుకోవాల్సి ఉంది. కాఫీ మొత్తం ఒకేసారి కలిపి పెద్ద సైజు ఫ్లాస్కులో పోసి ఉంచండి. కప్పు కప్పు కనుక వేడిచేస్తే గ్యాస్ వృధా అవుతుంది. పాలు తాగే పిల్లలుంటే మరిగిన పాలు చల్లారకముందే వేరే ఫ్లాస్క్‌లో ఉంచితే వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు వేడిపాలు రెడీగా ఉంటాయి. వంటలు వేడి చేయనవసరం లేకుండా వండిన వెంటనే హాట్‌పేక్‌లో ఉంచండి. కూరలు, పప్పులు వగైరా రెడీ వుంచుకుంటే అన్నీ ఒకేసారి కుక్కర్లో ఉడుకుతాయి. స్టౌ వెలిగించే ముందు కూరకు తడుముకోకుండా, ముందుగా కూరకు, సాంబారుకు అన్నిటికీ కూరగాయలు తరిగి రెడీగా పెట్టుకోవాలి. ఆరునెలలకోసారి స్టౌ సర్వీసింగ్ చేయించి అవసరమైతే రబ్బర్ ట్యూబు అవీ మార్చండి.