Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెన్షన్ లేకుండా టైమ్ ప్రకారం వంట పనులు పూర్తి కావాలంటే!?

టెన్షన్ లేకుండా టైమ్ ప్రకారం వంట పనులు పూర్తి కావాలంటే!?
, మంగళవారం, 20 మార్చి 2012 (14:17 IST)
FILE
మీరు ఉద్యోగం చేస్తున్నారా..!? ఆఫీసుకు వెళ్లాలని హడావుడిలో వంటింట్లో తెగ టెన్షన్ పడతున్నారా. అలాంటి వారు మీరైతే.. ఈ చిట్కాలు పాటించండి.. వంటింట్లో మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

* ముందుగా రేపు చేయవలసిన కూరలేమిటో ఆలోచించుకొని తరిగి వుంచుకొని పాలిధిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
* పాల అబ్బాయి కోసం ప్రొద్దుటే ఎదురు చూడకుండా ఓ పాల ప్యాకెట్టుని ముందుగానే ఫ్రిజ్‌లో రిజర్వు చేసుకుంటే కాఫీల పని ఆలస్యం కాకుండా పూర్తి అవుతుంది.
* వంటింట్లో కుళాయిలో నుండి బిందెలోకి పైప్ వేసి నీళ్ళు పట్టుకుంటే అది నిండేలోగా మరో పని చేసుకోవచ్చు.
* గ్రుడ్లు ఎప్పుడూ ఇంట్లో వుంచుకోవడం మంచిది.

* మీకు ఇష్టమైన ఆవకాయ లేదా నిమ్మకాయ గోంగూర మొదలైన ఊరగాయలు, నల్లకారం, కొబ్బరి కారం లాంటి పొడులు నిల్వవుంచుకోవాలి. అవసరమైనప్పుడు వాటితో సరిపెట్టుకోవచ్చు.
* కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడు సిద్ధంగా వుంచుకోవాలి.
* వంటింట్లో తెల్లారి టెన్షన్ పడకుండా ఉండాలంటే మెలోడీ సంగీతం వింటూ పనిచేసుకోండి.
* మాటిమాటికి టెన్షన్ పడకుండా ఓ పద్ధతి ప్రకారం అన్నం, కూరలు, వేపుళ్లు చేసుకుంటూ వెళ్లండి.
* వండిన వంటకాల్ని అప్పుటికప్పుడే డైనింగ్ టేబుల్‌లో పద్ధతిగా అమర్చుకోండి.

* ఫ్రిజ్ వాటర్‌బాటిల్స్, అన్నీ ఒకేసారి పట్టుదామని అట్టే పెట్టకుండా ఎప్పుడు బాటిల్స్ అప్పుడు నింపి పెట్టుకోండి. ఇలా చేస్తే గృహిణులైనా సరే, ఉద్యోగినులైనా సరే టెన్షన్ ఫ్రీగా వంటలు చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu