కాఫీకి మరింత సువాసన రావాలంటే..!?
, మంగళవారం, 17 జులై 2012 (17:49 IST)
కాఫీకి మరింత సువాసన రావాలంటే ఫిల్టర్‌లో వేడినీళ్ళు పోసేటప్పుడు చిటికెడు ఉప్పువేయాలి. దీని వలన రుచికూడా పెరుగుతుంది. బఠాణీలను కాస్త కూరపొడి, కొంచెం వెన్న ఉప్పు కలిపి తగినంత వేడిలో పావుగంట వేయిస్తే చాలా రుచిగా వుంటాయి. పాలు బాగా మరిగిపోయి మాడు వాసన వస్తుంటే ఆ పాలలో ఒక తమలపాకు వేసి కొంచెం సేపు మరిగిన తర్వాత ఆ తమలపాకును తీసేయండి. మాడు వాసన మటుమాయమవుతుంది. మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, ఎండు మిరప కాయలు వేసి బాగా రుబ్బి తగినంత నీరు కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి. వాటిని పలచని అప్పడాలుగా చేసి ఎండబెడితే కరకరలాడుతూ బావుంటాయి.