Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవకాయపచ్చడి బూజు పట్టకుండా ఉండాలంటే..!?

Advertiesment
ఆవకాయపచ్చడి
FILE
ఆవకాయపచ్చడి బూజు పట్టకుండా ఉండాలంటే.. జాడీలో కొంచెం బెల్లం పొడి చల్లితే బూజు పట్టదు. అప్పడప్పుడు కాసేపు ఎండలో ఉంచి తిరిగి జాడీలో భద్రపరిచినా ఆవకాయ పచ్చడి బూజు పట్టకుండా చాలా రోజుల పాటు చెడిపోకుండా ఉంటుంది.

ఇక, ఇడ్లీలు మెత్తగా రావాలంటే రవ్వతోపాటు కొద్దిగా అన్నంకూడా వేసి రుబ్బాలి. రుబ్బిన వెంటనే కాకుండా ఐదారుగంటల తర్వాత ఇడ్లీవేయాలి. అన్నం ముద్దవకుండా వుండాలంటే బియ్యానికి నీరుచేర్చే ముందు కాస్త నిమ్మరసం పిండండి.

చేపలు నీచువాసన రాకుండా ఉండాలంటే ముక్కలుగా తరగటానికి ముందు ఒక గంట పాటు ఉప్పు నీటిలో వేసిన తర్వాత పసుపు వేసి శుభ్రమైన నీటితో కడగండి. అటుకులు రుచిగా వుండాలంటే కొబ్బరికోరు యాలకులపొడి కొద్దిగా కలపండి.

Share this Story:

Follow Webdunia telugu