Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూరగాయలు, పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... చిట్కాలు..

కూరగాయలు, పప్పులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... చిట్కాలు..
, శనివారం, 8 నవంబరు 2014 (18:13 IST)
ఈ కాలంలో భార్యాభర్తలు ఉదయాన్ని ఆఫీసులకు బయలుదేరి వెళ్లిపోయి, పొద్దుపోయిన తర్వాత ఇళ్లకు వస్తున్నారు. దీంతో సెలవు చిక్కినప్పుడే కావలసినంత పప్పు, ఉప్పును వంటింటి డబ్బాల్లో కుక్కిపెట్టుకుంటున్నారు. అయితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి... 
 
సంవత్సరానికి సరిపడా పప్పులు తెచ్చుకున్నప్పుడు వాటిల్లో పొట్టుతో కూడిన పప్పు చాలా వేస్ట్ కింద పోతుంది. అది వృధాగా పోకుండా కాసేపు ఎండలో వుంచి తరువాత రోట్లో వేసి బండతో పైపైన నూరి చెరిగితే పొట్టుపోయి పప్పు శుభ్రపడుతుంది. 
 
పురుగు పట్టకుండా... 
చింతపండు పురుగు పట్టకుండా నిల్వ వుండాలంటే గింజలను తీసివేసి ఎండబెడితే పురుగు పట్టదు. చింతపండు ఫ్రెష్‌గా ఉంటుంది. 
 
తొక్క తీయకుండా... 
బంగాళాదుంపలలో పై తొక్కలో విటమిన్-ఎ, విటమిన్-కె, ఐరన్ పుష్కలంగా వుంటాయి. అందువల్ల వీలైనంత వరకు తొక్క తీయకుండా వండుకోవడమే ఉత్తమం. 
 
కాకరకాయ చేదు 
కాకరకాయ చేదుగా తినలేని వారు కాయలకి పైన ఉన్న బుడిపెలను పీలర్‌తో చెక్కేసి వండుకుంటే చేదు అనిపించవు.
 
పసుపు ఎక్కువైతే... 
కూరల్లో పసుపు ఎక్కువైంది అనిపిస్తే, తెల్లని బట్టముక్కని కూర ఉడుకుతుండగా కూరలో వేస్తే ఎక్కువైన పసుపుని ఆ బట్ట పీల్చుకుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu