బంగాళదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కోయకూడదా...?
చాలామంది బంగాళా దుంపలను వండేముందుగా చిన్నచిన్న ముక్కలుగా తరిగేసి వండేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల దానిలో వున్న విటమిన్ సి పోతుంది. అందుకే బంగాళా దుంపలను ఉడకబెట్టి ఆ తర్వాత దాని తోలు తీయాలి. కొందరు దుంపలను ఉడకబెట్టకుండానే పీలర్ తీసుకుని దాన
చాలామంది బంగాళా దుంపలను వండేముందుగా చిన్నచిన్న ముక్కలుగా తరిగేసి వండేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల దానిలో వున్న విటమిన్ సి పోతుంది. అందుకే బంగాళా దుంపలను ఉడకబెట్టి ఆ తర్వాత దాని తోలు తీయాలి. కొందరు దుంపలను ఉడకబెట్టకుండానే పీలర్ తీసుకుని దాని తోలు తీసేసి కూరలో వేసేస్తారు. ఇలా చేయడం వల్ల విటమిన్లు కోల్పోతుంది.
బంగాళా దుంపలో మాంసకృత్తులు చాలా విశిష్టమైనవి. 100 గ్రాముల బంగాళాదుంపలో 1.6 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో సగటున రోజుకు తలసరి 3 కి.గ్రాముల బంగాళా దుంపలు తింటారు. ఐతే మన దేశంలో బంగాళా దుంపలను కేవలం కూరలుగా మాత్రమే వాడుతుంటారు.