పట్టుచీరలు ఉతుకుతున్నారా? కోడిగుడ్లను ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే?
మహిళలు పట్టుచీరలంటే ఎంతో ఇష్టపడతారు. వాటిని చాలా భద్రంగా ఉంచుకుంటారు. అలాంటి పట్టుచీరలను ఉతికేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి పట్టు చీరలను ఉతికేటప్పుడు.. బకెట్లో కాస్త నిమ్మరసం వేయడం ద్వా
మహిళలు పట్టుచీరలంటే ఎంతో ఇష్టపడతారు. వాటిని చాలా భద్రంగా ఉంచుకుంటారు. అలాంటి పట్టుచీరలను ఉతికేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి పట్టు చీరలను ఉతికేటప్పుడు.. బకెట్లో కాస్త నిమ్మరసం వేయడం ద్వారా రంగు పోవు. కానీ అధిక మోతాదులో నిమ్మరసాన్ని ఉపయోగించాలి. నిమ్మరసాన్ని బకెట్ నీళ్లలో పోసి బాగా కలిపేసిన తర్వాతే పట్టుచీరను అందులో వేయాలి.
ఇకపోతే.. వంట చేసే సమయంలో నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి చల్లాలి. ఇది నూనెను త్వరగా పీల్చేస్తుంది. గుడ్లు ఉడకపెట్టిన తరువాత వాటి పెంకులు తీసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వడం వల్ల పెంకులు త్వరగా వచ్చేస్తాయి.
వంకాయ ముక్కలు కోయగానే వెంటనే నల్లబడుతుంటాయి. ఇలా నల్లగా ఏర్పడకుండా ఉండాలంటే ఒక స్పూన్ పాలు వేయాలి. పసుపు నీటితో వంటగదిని శుభ్రం చేయడం వల్ల ఈగలు దరి చేరవు.