Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి...

బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి...
, శనివారం, 27 మార్చి 2021 (15:20 IST)
ఎన్నో అనారోగ్య సమస్యలకు మన ఇంట్లోని పోపుల పెట్టెలో వుండే దినుసులే ఔషధాలుగా ఉపయోగపడతాయి. ధనియాలను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ధనియాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. ధనియాల కషాయం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులు దూరమవుతాయి. ధనియాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
 
2. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతూంటే నివారణ కల్గుతుంది.
 
3. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
 
4. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.
 
5. వేసవిలో విపరీతమైన దాహం ఉంటుందిగానీ ఆకలి తక్కువ. ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.
 
6. షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతుంది. అంతేకాదు కిడ్నీ సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. 
 
7. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది.
 
8. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.
 
9. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు