Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కర్ ఎలా వాడాలంటే..?

Advertiesment
cooker
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:05 IST)
కుక్కర్‌తో ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కుక్కర్‌లో కొలత ప్రకారం నీటిని పోయాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్లో పడిపోయి, కుక్కర్‌లోని నీటితో ఉడకటం వలన కుక్కర్లోనీరు ఇంకిపోయి స్టేఫ్టీ వాల్వ్ బద్ధలవడం, వెయిట్ ఎగిరిపోయి కుక్కర్లోని పదార్థాలు పైకి చిమ్మటం లాంటివి జరుగుతాయి. 
 
గాస్కెట్ పాడయిపోతే, కుక్కర్ పక్కల నుంచీ ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువల్ల లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికీ విజిల్‌రాదు. కుక్కర్‌లోని నీరంతా అయిపోయి, సేఫ్టీవాల్వ్ పోతుంది. కుక్కర్‌మూత పక్కనుంచీ ఆవిరి బయటకు వస్తుంటే గాస్కెట్‌ను మార్చాలి. 
 
కుక్కర్‌లో పెట్టిన గిన్నెలలో ఆహార పదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలలో నీరు అవి ఉడికించేందుకు సరిపడా పోయాలి. చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వల్ల అవి సరిగ్గా ఉడకవు. లేదా పొంగి కుక్కర్లో పడతాయి. 
 
కుక్కర్లో మూతకున్న ఆవిరి రంధ్రం మూసుకుపోకుండా ప్రతిరోజు శుభ్రపరచాలి. అదేవిధంగా వెయిట్‌ని కూడా ప్రతిరోజు శుభ్రం చేయాలి. కుక్కర్లోంచి ఆవిరి త్వరగా రావటానికి, లోపలి పదార్థాలు ఉడకటానికి హెచ్చు మంటను పెట్టాలి. వెయిట్ పెట్టిన తర్వాత కూడా మంటలను తగ్గించకూడదు.
 
విజిల్ వచ్చిన తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాత మంటను తగ్గించి, ఆ తర్వాతే స్టౌను ఆర్పాలి. కుక్కర్‌ను దింపిన తర్వాత వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. దానివలన గ్యాస్‌కట్ దెబ్బతింటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయుర్వేదంతో చుండ్రు మాయం.. ఎలాగో తెలుసుకోవాలంటే?