Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గృహిణుల కోసం కొన్ని వంటింటి చిట్కాలు!

గృహిణుల కోసం కొన్ని వంటింటి చిట్కాలు!
, సోమవారం, 2 జూన్ 2014 (17:39 IST)
సాధారణంగా వంటింటి చిట్కాలు గృహిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి చిట్కాల్లో కొన్నింటిని వారి కోసం... 
 
పులుసులో ఉప్పు ఎక్కువైనప్పుడు
మీరు రుచికరంగా చేయాలనుకున్న పులుసులో ఉప్పు ఎక్కువైందా? అలాంటప్పుడు ఏం చేస్తారంటే చపాతీ పిండిని ఏడు లేదా ఎనిమిది ఉండలుగా చేసి దానిని పులుసులో వేసి కాసేపాగి తీసేయండి. పులుసు చాలా రుచిగా ఉంటుంది.
 
ఊరిమిరప రుచి కోసం
ఊరిమిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని కోయాలి. అలాగే కాసిని మెంతులు, మినపప్పులను నూరి మజ్జిగలో ఉప్పు వేసి పచ్చిమిర్చిని ఊరబెట్టండి. రుచిగా ఉంటాయి.
 
కూరలు మిగిలిపోతే
వండిన కూరలు, పచ్చివి ఏవైనా మిగిలిపోయాయని పారేయకండి వాటిని కలిపి చింతపులుసు పోసి ఉప్పు, పసుపు, కారాలను వేసి పులుసులా పెట్టండి, కొత్త రకం పులుసు రెడీ అయిపోతుంది. 
 
కొత్తి మీర కాడలతో సువాసనలు 
కొత్తిమీర ఆకులను చారులో వేశారా ? అయితే వాటి కాడలను పారేయకండి. దానిని పులుసు లేక సాంబారులలో వేసి కావాలంటే తీసేయండి. సాంబార్ చాలా సువాసనగా ఉంటుంది.
 
సాంబార్ రుచి కోసం
సాంబార్ చేసేందుకు కందిపప్పును ఉడికిస్తున్నారా అయితే ఉడికించే సమయంలో ఇందులో కాసిని మెంతులను కూడా వేయండి రాత్రి వరకు పాడవకుండా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu