ఇంటిని శుభ్రం చేసేందుకు రకరకాలు మందులు వాడుతుంటారు. అయినా కూడా ఇంట్లో దుర్వాసన వస్తున్నే ఉందా.. అందుకు ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటే దుర్వాసన తొలగిపోతుంది. చెక్క కుర్చీలు శుభ్రం చేయడానికి కొంతమంది వట్టి నీటితో తుడుస్తుంటారు. అలా చేస్తే కుర్చీలు త్వరగా పాడైపోతాయి.
అందువలన గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితో కుర్చీలను శుభ్రం చేసుకుని కొద్దిసేపు ఎండలో ఉంచుకుంటే కొత్తవాటిలా కనిపిస్తాయి. వంటింట్లో గట్టుపై గుడ్డు పగిలినప్పుడు ఆ ప్రాంతంల్లో ఉప్పు చల్లుకుని కాసేపు తరువాత నీటితో శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది. కొందరు బూట్లు తెగ వాడేస్తుంటారు. వాటినుండి వచ్చే దుర్వాసన చాలా విపరీతంగా ఉంటుంది.
ఆ వాసనను తొలగించేందుకు ఆ బూట్లపై కొద్దిగా ఉప్పు చల్లుకుంటే వాసన పోతుంది. ఇత్తడి, రాగి పాత్రలు కొన్ని రోజుకే రంగు మారిపోతాయి. వాటిని శుభ్రం చేసేటప్పుడు బియ్యం పిండిలో వెనిగర్, ఉప్పు కలిపి తోముకుంటే కొత్త వాటిలా మెరుస్తాయి.