నిల్వ ఉంచిన పచ్చళ్ళు మీకు పడట్లేదా? అయితే ఇలా చేయండి.
నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి, కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతో తినండి.
అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ వుండటం లేదా? వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్లో వుంచండి.
పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అందులో కొన్ని లవంగాలని వేయండి.
చేప ముక్కల్ని నిల్వచేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు.
పాస్తా చేసేప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు. ఉడికిన తర్వాతనే వెయ్యాలి.
స్వీట్స్ చేసేప్పుడు చక్కెరకు బదులుగా దానిని పొడిచేసి వేస్తే అవి ఇంకా రుచిగా వుంటాయి.
లంచ్ బాక్స్‌లు వాసన వేస్తున్నాయా? రెండు మూడు రోజులకొకసారి నిమ్మచెక్కతో రుద్ది కడగండి.
వాల్ నట్స్‌ను రాత్రంతా ఉప్పునీటిలో నానబెట్టి ఉదయాన పెంకును సులువుగా తీయొచ్చు.
కూరగాయలు తరిగేప్పుడు చేయి కాలినా/తెగినా అలోవెరా జెల్‌ను రాయండి.
కేక్ గుడ్డు వాసన వస్తూంటే… తయారు చేసేప్పుడు రెండు స్పూన్ల తేనె కలపండి.
అల్యూమినియం గిన్నెలో వండేప్పుడు గిన్నె మాడుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వెనిగర్ వేయండి.
గ్రేవీ, సూపులు చిక్కగా రావడం లేదా? అవి తయారు చేసేప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపండి.
నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి, కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతో తినండి.