Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంటింటి చిట్కాలు: కాఫీ రుచిగా ఉండాలంటే.. డికాషన్‌లో ఉప్పు?

వంటింటి చిట్కాలు: కాఫీ రుచిగా ఉండాలంటే.. డికాషన్‌లో ఉప్పు?
, శుక్రవారం, 18 డిశెంబరు 2015 (16:16 IST)
* అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
 
* నిలువ పచ్చళ్ళకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి.
 
* అరటి పువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన, రంగు మారిపోతుంది.
 
* పప్పులు, ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటుంది. 
 
* పచ్చి బఠానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
 
* టీ కప్ అడుగు భాగంలో టీ మరకలు పోవాలంటే ఉప్పు నీళ్ళతో కడిగితే మరకలు సులువుగా వదులుతాయి.
 
* ఆకుకూరలు ఉడికించిన నీటిని సూప్‌లా వాడుకోవచ్చు.
 
* కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu