షీష్ కబాబ్ పొటాబో వెడ్జెస్ తయారు చేయడం ఎలా..?
, శుక్రవారం, 26 జులై 2013 (16:40 IST)
కావలసిన పదార్థాలు : ఉడికించి మెత్తగా చేసిన చికెన్ : పావు కిలోచీజ్ తురుము : పావు కప్పుఉప్పు : తగినంతవెల్లుల్లి పేస్ట్ : అర టీ స్పూనుమిరియాల పొడి : పావు టీ స్పూనుదాల్చిన చెక్క పొడి : అర టీ స్పూనుస్వీట్కార్న్ : 1బంగాళా దుంపలు : రెండు (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి)ఆవిరి మీద ఉడికించిన ఉల్లిపాయలు - 1రెడ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు : 8 (పెద్దవి)తయారు చేయు విధానం : మెత్తగా చేసిన చికెన్, ఉప్పు, వెల్లుల్లి, పేస్ట్, మిరియాల పొడి, దాల్చినచెక్క పొడి...వీటిని ఒక పాత్రలో వేసి బాగా కలిపి, పెద బాల్స్‌లా చేసి పక్కన ఉంచాలి. కబాబ్ తయారుచేసే ఊచకి...బంగాళదుంప ముక్క, చికెన్ బాల్, క్యాప్సికమ్ ముక్క, మొక్కజొన్న ముక్క గుచ్చాలి. ఈ విధంగా మళ్లీ ముక్కులను గుచ్చాలి.