వంటింటి చిట్కాలు : నిల్వ వుంచిన బియ్యం పురుగు పట్టకుంటా ఉండాలంటే!!
, శుక్రవారం, 30 మార్చి 2012 (14:33 IST)
* బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.* గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ను తరుచూ నిమ్మరసంలో నానబెట్టి శుభ్రపరచాలి. అప్పుడే దానిపై చేరుకొని ఉన్న హానికారక క్రిముల దూరమవుతాయి.* వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా తయారు చేసి వెండి వస్తువులను రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.* కొవ్వొత్తులని ఫ్రిజ్‌లో ఉంచి.. వెలిగిస్తే ఎక్కువ సేపు వెలుగుతాయి.* ప్రమిదలని నీటిలో నానబెడితే నూనెని ఎక్కువగా పీల్చుకోవు.* అగరొత్తుల బూడిదతో వెండి వస్తువులను తోమితే కొత్త వాటిలా మెరుస్తాయి.* బాణలిలో పదార్థాలు అంటుకుపోతే నీళ్లు పోసి అందులో చారెడు ఉప్పు వేసి మరిగించాలి. కొద్దిసేపటికి నీళ్లు పోసేసి కాగితంతో రుద్దితే పాన్ శుభ్రపడుతుంది.* క్రీమ్ చీజ్ ఇంట్లో అందుబాటులో లేనప్పుడు పనీర్‌ను చేత్తో మెత్తగా చేసి చిక్కటి పెరుగులో వేసి వాడుకుంటే సరిపోతుంది.* గదిని శుభ్రం చేసే నీటిలో అరకప్పు గులాబీనీటిని కూడా జోడిస్తే గదంతా పరిమళభరితంగా ఉంటుంది.* పొట్టు తీసిన వెల్లుల్లిరేకలను కప్పు వంటనూనెలో వేసుకొని ఉంచితే ఆ నూనె చక్కటి వాసన వస్తుంది. * కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొడితే తర్వాత శుభ్రపరచడం తేలిక అవుతుంది.* ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టండి.*. గోధుమ, శెనగపిండిలలో తేమ చేరకుండా ఉంటాలంటే బిరింజి ఆకు వేయాలి.* ఫ్రిజ్‌లో కూరగాయల అర అడుగున కాగితం పరిచి వాటిని ఉంచితే తడిని ఎప్పటికప్పుడు పీల్చుకుంటుంది. కూరలు చెడిపోవు.