గులాబ్‌జామ్ చేసినప్పుడు చక్కెర మిగిలిపోయిందా!?
, బుధవారం, 11 జులై 2012 (16:51 IST)
గులాబ్‌జామ్ చేసినప్పుడు చక్కెర ఎక్కువగా మిగిలితే అందులో వేయించిన గోధుమరవ్వ వేసి ఉడికించి హల్వా చేసుకోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు గోధుమపిండిలో నీళ్లుకు బదులుగా పాలు కలిపి చపాతీలు చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి. పులిహోర చేసేటప్పుడు అన్నం వుడికేసమయంలో ఒక చెంచా నెయ్యికాని, వెనన్నకాని వేస్తే అన్నంముద్ద కాకుండా పొడిపొడిగా వుంటుంది. మైదాపిండికీ, గోధుమపిండికీ పురుగు పట్టకుండా ఉండాలంటే నాలుగు చెమ్చాల ఉప్పును శుభ్రమైన బట్టలో మూటకట్టి పిండి డబ్బాలో వేయండి. ఫ్లాస్క్ వాడనప్పుడు దానిలో పావుచెమ్చా పంచదార వేయండి దుర్వాసన రాదు. అన్నం మెత్తబడినప్పుడు కొద్దిగా క్యారెట్ కోరు వేయండి. పొడిపొడిగా ఉంటుంది. వెన్నకాచేటప్పుడు తాజా బంగళాదుంప ముక్క, కొంచెం కరివేపాకు వేస్తే నెయ్యి సువాసనభరితంగా ఉంటుంది.