కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మొత్తగా పేస్ట్‌మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి. అల్లం, పచ్చిమిరపకాయలను కూడా అలాగే మొత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి, ఉప్పు కలిపి నిలవవుంచుకోవచ్చు.