కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు.. ఒక కప్పు
మీడియం సైజు టొమోటోలు.. మూడు
కీరదోస ముక్కలు.. ఒక కప్పు
ఉల్లికాడల ముక్కలు.. అర కప్పు
మీగడ తీసిన పెరుగు... 3 టీ.
నిమ్మరసం.. 2 టీ.
వెల్లుల్లి ముక్కలు.. ఒక టీ.
కొత్తిమీర తరుగు.. 2 టీ.
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి.. అర టీ.
తయారీ విధానం :
మొక్కజొన్న గింజల్ని ఉడికించి వార్చాలి. ఒక బౌల్‌లో ఉడికించిన మొక్కజొన్న గింజలు, టొమోటో ముక్కలు, ఉల్లిముక్కలు, కీరదోసముక్కలు వేసి కలిపాలి. వేరొక గిన్నెలో పెరుగులో కొత్తిమీర, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు.. ఉప్పు, మిరియాలపొడిలను వేసి బాగా కలిపి మొక్కజొన్న గింజలుంచిన బౌల్‌లో పోసి కలపాలి. ఈ బౌల్‌ను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తరువాత తీసి సర్వ్ చేయాలి. చల్లదనం ఇష్టం లేని వారు ఫ్రిజ్‌లో పెట్టకుండా తినవచ్చు. అంతే కార్న్ టొమోటో సలాడ్ తయార్...!