"సాసీ కాలీఫ్లవర్" విత్ పీనట్ బటర్
కావలసిన పదార్థాలు :కాలీఫ్లవర్... ఒక కప్పుమైదా... ఒకటిన్నర టీ.పీనట్ బటర్... ముప్పావు టీ.పాలు... పావు కప్పుబటర్... ఒకటిన్నర టీ.పీనట్స్... అర కప్పుఉప్పు... రుచికి సరిపడానెయ్యి... ఒక టీ.తయారీ విధానం :ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పునీటిలో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తరువాత కాస్తంత ఉప్పువేసి వాటిని ఉడికించాలి. ఈలోగా పాన్‌లో బటర్ వేసి కాగిన తరువాత మైదా వేసి కలపాలి. వేగిన పిండికి పీనట్ బటర్ వేసి కరిగించాలి. కరిగిన తరువాత పాలుపోసి కలుపుతూ పేస్ట్ లాగా చేయాలి.వేరొక బాణలిలో ఒక టీస్పూన్ నేతిలో పీనట్స్ వేయించుకోవాలి. చివరగా ఉడికించిన కాలీఫ్లవర్, వేయించిన పీనట్స్ ముక్కలు, ఒక కప్పు నీరు, సరిపడా ఉప్పువేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికిన తరువాత పైన తయారు చేసుకున్న పేస్ట్ వేసి మరికాసేపు ఉడికించి దించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే వేడి సాసీ కాలీఫ్లవర్ విత్ పీనట్ బటర్ తయార్..!!