Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెరైటీ అండ్ క్రిస్పీ.. "పనీర్ గుల్నారి కబాబ్"

వెరైటీ అండ్ క్రిస్పీ..
FILE
కావలసిన పదార్థాలు :
పనీర్... అరకేజీ
పచ్చిమిర్చి తురుము... 20 గ్రా.
కొత్తిమీర తురుము... గుప్పెడు
ఉల్లిపాయ తరుగు... చిన్న కప్పు
ఆలుగడ్డ గుజ్జు... గుప్పెడు
బ్రెడ్ క్రంబ్ పౌడర్... 50 గ్రా.
ఉప్పు... సరిపడా
గరంమసాలా పొడి... 5 గ్రా.
జీరాపొడి... 5 గ్రా.
నూనె... సరిపడా

తయారీ విధానం :
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ కలిపి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. మిశ్రమం మొత్తాన్ని జిగురులాగా అయ్యేంతదాకా కలిపి, ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తరువాత మిశ్రమాన్ని సీకుకు పట్టించి సాగదీయాలి. దూరి లేదా ఓవెన్‌లో 5 నుండి 10 నిమిషాల పాటు పై సీకుకు పట్టించిన మిశ్రమాన్ని ఉడికించాలి. ఆపై సీకును తీసివేసి కావాల్సిన సైజులో కబాబ్‌ల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu