కావలసిన పదార్థాలు :
పాలపొడి.. అర కప్పు
కండెన్స్‌డ్ మిల్క్.. రెండు టీ.
ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, తాజా వెన్న.. తలా ఒక్కో టీ.
అంజూర్ తరుగు.. ఒక పెద్ద టీ.
బాదంపప్పులు.. గుప్పెడు
తయారీ విధానం :
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ వేసి పాలుపోసి.. గట్టి చపాతీల పిండిలాగా మృదువుగా కలపాలి. ఈ మిశ్రమానికి అంజూర్ తరుగును కూడా వేసి కలపాలి. ఇప్పుడు వెడల్పాటి గాజు ట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి.. అందులో పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి.
గట్టిగా కేక్‌లా ఉండే ఈ మిశ్రమాన్ని చక్కని షేపులో ముందుగానే సన్నని కత్తితో కోసుకుని.. వాటిపై బాదం పప్పులతో అలంకరించాలి. ఇప్పుడీ ట్రేను డీప్‌ఫ్రీజర్‌లో పెట్టి, సరిగ్గా పావుగంట తర్వాత తీసి... దానికి వెనీలా ఐస్‌క్రీమును జోడించి వడ్డించేయండి. అంతే రుచికరమైన వాలంటైన్ చాక్లెట్ తయారైనట్లే..!