కావలసిన పదార్థాలు :
ముళ్లులేని చేప ముక్కలు.. అర కేజీ
వెన్న.. 50 గ్రా.
పెరుగు.. ఒక కప్పు
కొత్తిమీర తరుగు.. ఒక టీ.
అల్లంముద్ద.. ఒక టీ.
పచ్చిమిర్చి ముద్ద.. అర టీ.
మిరియాలపొడి.. అర టీ.
గరంమసాలా.. అర టీ.
ఉప్పు.. తగినంత
తయారీ విధానం :
శుభ్రం చేసిన చేప ముక్కలకు పెరుగు, వెన్న, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, మిరియాలపొడి, ఉప్పు పట్టించి అరగంటసేపు ఊరనివ్వాలి. కబాబ్ చువ్వలకు ఈ ముక్కలను గుచ్చి ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద పది నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. వీటిని కూరగాయ ముక్కలతో అలంకరించి ఏదేని చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.