Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెండ్లీ స్నాక్స్... "కోకోనట్ కుకీస్"

ఫ్రెండ్లీ స్నాక్స్...
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. 60 గ్రా.
బటర్.. 60 గ్రా.
పంచదార.. 30 గ్రా.
డెసికేటెడ్ కోకోనట్ పౌడర్.. 30 గ్రా. (మార్కెట్లో దొరుకుతుంది)
ఏలకులు, జాజికాయ పొడి.. అర టీ.

తయారీ విధానం :
బటర్‌ను క్రీమ్‌లాగా చేయాలి. దాంట్లో పంచదార వేసి మెత్తగా అయ్యేదాకా కలపాలి. ఇందులోనే ఏలకులు, జాజికాయపొడి కూడా వేసి కలపాలి. ఆపై డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసి స్పూన్‌తో మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్ది కొద్దిగా ఉండలుగా తీసుకోవాలి.

గుండ్రటి ఉండను చేత్తో కొద్దిగా ఒత్తుకుని నెయ్యి రాసిన ట్రేలో పెట్టాలి. అన్ని కుకీస్‌ను ఇలాగే చేసి ట్రేలో పెట్టాలి. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీలలో వేడి చేసి, అందులో ఈ ట్రేను ఉంచి, 15 నిమిషాలపాటు లేత గోధుమరంగు వచ్చేదాకా బేక్ చేయాలి. చల్లారిన తరువాత సర్వ్ చేయాలి. అంతే కోకోనట్ కుకీస్ రెడీ..!

Share this Story:

Follow Webdunia telugu