కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ ఫిష్.. 700 గ్రా.
ఉల్లిపాయ తరుగు.. ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు.. 3
ఎండుమిర్చి.. 2
నూనె.. 3 టీ.
ష్రిమ్స్ పేస్ట్ (షెల్ ఫిష్).. 2 టీ.
బీన్స్ తరుగు.. 100 గ్రా.
గోబీ తరుగు.. ఒక పువ్వు
మష్రూమ్స్.. 200 గ్రా.
ఫిష్ సాస్.. ఒక టీ.
మిరియాలపొడి.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
కారంపొడి.. తగినంత
తయారీ విధానం :
చేపను గ్రిల్ చేసి పై చర్మం, ముళ్లు తీసివేసి.. చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఉల్లి, వెల్లుల్లి తరుగు, కారంపొడి వేసి 2 నిమిషాలపాటు వేయించాలి. ష్రిమ్స్ పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాక బీన్స్, గోబీ, మష్రూమ్స్ తరుగులను వేసి ఐదు నిమిషాలు వేయించాలి.
దాంట్లో 2 టీస్పూన్ల నీరు పోసి మూతపెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. తరువాత ఉప్పు, మిరియాలపొడి, ఫిష్ సాస్ కూడా కలిపి మరికాసేపు ఉంచాలి. చివర్లో చేపముక్కలను కలిపి దించేయాలి. దీన్ని నూడుల్స్‌తోపాటు వేడి వేడిగా తింటే సూపర్బ్‌గా ఉంటుంది.