చైల్డ్ ఫేవరేట్ ఫుడ్ "రైస్ క్రొకెట్సు"
కావలసిన పదార్థాలు :అన్నం.. రెండు కప్పులుమైదా పిండి.. అర కప్పుబీన్స్.. 50 గ్రా.కాలీఫ్లవర్.. ఒక కప్పుపచ్చిబఠానీలు.. 50 గ్రా.క్యారెట్.. ఒకటిఉప్పు.. తగినంతమిరియాలపొడి.. కొద్దిగానూనె.. తగినంత వైట్‌సాస్ తయారీ కోసం..కార్న్‌ఫ్లోర్.. రెండు టీ.మిరియాలపొడి.. అర టీ.ఉప్పు.. తగినంతపాలు.. ఒక గ్లాసువెన్న.. కొద్దిగాతయారీ విధానం :వైట్‌సాస్ తయారు చేసేందుకు బాణలిలో వెన్నను వేడిచేసి అందులో పాలు, కార్న్‌ఫ్లోర్ కలిపి మరుగుతుండగా ఉప్పు, మిరియాలపొడి చేర్చి బాగా కలిపి పక్కనుంచాలి. కూరగాయల్ని చిన్న ముక్కలుగా తరిగి ఉడికించి నీరు వార్చి ఉంచాలి. వీటిని వైట్‌సాస్‌తో కలిపి సన్నటి మంటమీద ఉడికించి చల్లార్చి పక్కనుంచాలి.అన్నంలో మైదాపిండిని కలిపి మెత్తటి ముద్దగా చేసి.. అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి, కాస్తంత నీరు చేర్చి ముద్దలా చేయాలి. అరటి ఆకుపై నూనె రాసి మైదా ముద్దను కొద్దిగా తీసి వేసి వెడల్పుగా వత్తి, మధ్యలో వైట్‌సాస్‌లో కలిపిన కూరగాయల మిశ్రమాన్ని ఉంచి నిలువుగా మడిచి పొడవుగా వత్తాలి. అలా మొత్తం చేసుకున్న తరువాత కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. వీటిని ఏదేని సాస్‌తో కలిపి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.