కావలసిన పదార్ధాలు
చెక్కుతీసి కంద .. ఒక కప్పు
పచ్చి శెనగ పప్పు .. ఒక కప్పు
అల్లం.. చిన్న ముక్క
పచ్చిమిర్చి .. నాలుగు
ఎండు మిర్చి .. రెండు లేదా మూడు
ఉప్పు .. తగినంత
నూనె .. వేయించడానికి సరిపడ
పచ్చి శెనగ పప్పును రెండు గంటలు నీళ్లలో నానబెట్టి వుంచుకోవాలి. అల్లం చిన్న ముక్కలుగ కట్ చేసి, మిక్సీలో కందతరుగు, నానబెట్టిన శెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి తిప్పి కొంచెం బరకగా రుబ్బుకుని తీసి, బాండీలో నూనె వేడిచేసి చిన్నచిన్న ఉండలను వడల మాదిరిగా తట్టి నూనెలో వేసి దోరగా వేపించి తీసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.