Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈజీ అండ్ టేస్టీ "చాంద్ బిస్కట్స్"

ఈజీ అండ్ టేస్టీ
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. 500 గ్రా.
పంచదారపొడి.. పావు కేజీ
యాలకులు.. 3 గ్రా.
వనస్పతి.. పావు కేజీ

తయారీ విధానం :
మైదాను జల్లించి, మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. ఆపై పంచదార పొడి చేర్చి ముద్దలా కలపాలి. అవసరమైతే మైదాపిండిని చల్లుతూ ముద్ద చేయాలి. పిండిని బాగా మర్దనా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఆ తరువాత యాలకుల పొడి కలపాలి.

ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో అద్దుతూ పోతే అర్థచంద్రాకారంలోని బిస్కట్లు రూపొందుతాయి. వీటిని ఓ ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచి బేక్ చేయాలి. అంతే చాంద్ బిస్కట్స్ తయార్..! చల్లారిన తరువాత ఆరగిస్తే సరి..!

Share this Story:

Follow Webdunia telugu