హెల్దీ అండ్ టేస్టీ టేస్టీ "స్టఫ్‌డ్ రోల్స్"
కావలసిన పదార్థాలు :ఫ్రెంచ్ రోల్.. ఒకటిఉడికించిన బఠాణీలు.. రెండు కప్పులుఉడికించిన పెసర మొలకలు.. ఒక కప్పుఅల్లం తరుగు.. ఒక టీ.పచ్చిమిర్చి తరుగు.. రెండు టీ.ఛాట్ మసాలా.. రెండు టీ.కొత్తిమీర తరుగు.. 2 గరిటెలుఉల్లితరుగు.. అర కప్పుఉప్పు.. సరిపడావెన్న.. తగినంతతయారీ విధానం :ఫ్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో భాగం ఒక్కో కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలను కాస్త అటు ఇటుగా చిదమాలి. అందులో అల్లం, పెసర మొలకలు, పచ్చిమిరపతరుగు, కొత్తిమీర, తరుగు, ఉప్పు, ఛాట్ మసాలా కలపాలి.ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ఫ్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాసి.. మైక్రోవేవ్ ఓవెన్‌లో పది నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే స్టఫ్‌డ్ రోల్స్ సిద్ధమైనట్లే.. వీటిని వేడి వేడిగా ఉల్లితరుగుతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.