కావలసిన పదార్థాలు :
చికెన్.. అర కేజీ
కార్న్‌ఫ్లోర్.. 3 టీ.
చిల్లీ సాస్.. 3 టీ.
మిరియాలపొడి.. అర టీ.
అజినమోటో.. అర టీ.
పల్చగా తరిగిన ఛీజ్ స్లైసులు.. 20
నూనె.. తగినంత
బర్గర్ బన్స్.. తగినన్ని
తయారీ విధానం :
చికెన్‌లో కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ముక్క మెత్తగా ఉడికిన తరువాత తీసి, ఎముకల నుండి మాంసం తీసి వేరు చేసి, మెత్తగా కైమాలా కొట్టుకోవాలి. ఇందులో చిల్లీసాస్, కార్న్‌ప్లోర్, మిరియాలపొడి, అజినమోటో కలిపి ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచని పాపడ్‌లు మాదిరిగా చేసి నూనెలో వేయించాలి.
బర్గర్ బన్నులను తీసుకుని, రెండు స్లయిసులుగా కోసుకోవాలి. కింది స్లయిసుమీద ఒక ఛీజ్ స్లయిసును దానిపై చికెన్ కైమా వడను, ఆపైన మరో ఛీజ్ స్లయిసు వుంచి పైన మరో బన్ను ముక్కను పెట్టి మొత్తం బర్గర్‌ను పిన్నుతో గుచ్చి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చిల్లీ చికెన్ బర్గర్స్ తయార్..!