వేసవి తాపాన్ని తీర్చే "టామరిండ్ జింజర్ మ్యాజిక్"
కావలసిన పదార్థాలు :వేడినీరు.. నాలుగు కప్పులుబ్రౌన్ షుగర్.. పావు కప్పుక్రిస్టలైజ్డ్ జింజర్ (అల్లం).. మూడు టీ.చింతపండు పేస్ట్.. రెండు టీ.తాజా నిమ్మరసం.. ఒక టీ.తాజా పుదీనా ఆకులు.. తగినన్నిఐస్ క్యూబులు.. సరిపడాతయారీ విధానం :ఒక పెద్ద పాత్రను తీసుకుని అందులో వేడినీరు, బ్రౌన్ షుగర్, అల్లం మరియు చింతపండు పేస్ట్‌లను వేసి బాగా కలియబెట్టాలి. ఈ పాత్రను స్టవ్‌పై ఉంచి సిమ్‌లో ఐదు నుంచి ఆరు నిమిషాలపాటు వేడి చేయాలి. దీనికి నిమ్మరసాన్ని జతచేసి కిందికి దించి చల్లార్చాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై సర్వింగ్ గ్లాసులలో ముందుగానే తగినన్ని ఐస్ క్యూబులను వేసి ఉంచాలి.ఫ్రిజ్‌లోంచి మిశ్రమాన్ని తీసి బాగా కలియబెట్టి గ్లాసులలోకి ఒంపాలి. పైన తాజా పుదీనా ఆకులను వేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన టామరిండ్ జింజర్ మ్యాజిక్ తయార్. వేసవితాపాన్ని ఇట్టే చల్లార్చే ఈ వెరైటీ డ్రింక్ తయారు చేయటం కూడా చాలా ఈజీయే.. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి మరి..!!