Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిల్క్‌మెయిడ్ "సఫ్రాన్ తండాయ్"

మిల్క్‌మెయిడ్
FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీ.
మిల్క్‌మెయిడ్.. వంద గ్రా.
కుంకుమ పువ్వు.. ఒక గ్రా.
ఐస్‌క్యూబ్స్.. మూడు
ఎండిన గులాబీ రేకులు.. 25 గ్రా.
బాదం.. 25 గ్రా.
ఏలకుల పొడి.. 5 గ్రా.
తర్భూజ గింజలు.. 25 గ్రా.
సోంపు.. 10 గ్రా.
మిరియాలు.. 5 గ్రా.
గసాలు.. 100 గ్రా.
పిస్తా.. 25 గ్రా.

తయారీ విధానం :
గులాబీ రేకులు, ఏలకులు, తర్భూజ గింజలు, సోంపు, మిరియాలు, గసాలను రెండు గంటలపాటు నానబెట్టి ఉంచాలి. పాలను కాచి చల్లార్చి పక్కన ఉంచాలి. నానబెట్టిన వాటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా కలియబెట్టాలి. ఆపై పాలను వడబోయాలి.

వడబోసిన పాలలో మిల్క్‌మెయిడ్, కుంకుమపువ్వు, ఐస్ క్యూబ్‌లను వేయాలి. పిస్తా, బాదంపప్పులను వేడినీటిలో నానబెట్టి పొట్టుతీసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్టును కూడా మిల్క్‌మెయిడ్ కలిపిన పాలల్లో వేసి బాగా కలియబెడితే మిల్క్‌మెయిడ్ తండాయ్ సిద్ధమైనట్లే..! దీనిని అలాగేగానీ, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరిచి అయినాగానీ సర్వ్ చేస్తే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu