మసాలా ఘుమఘుమలతో "వెజిటబుల్ ఫ్రైడ్ చపాతీ"
కావలసిన పదార్థాలు : క్యారెట్, కాలీఫ్లవర్, బీట్రూట్ తురుములు... అన్నీ ఒక్కో కప్పుఉల్లిపాయ తురుము... ఒక కప్పుపచ్చి మిర్చి... నాలుగు వెల్లుల్లి... నాలుగు అల్లం... చిన్న ముక్క పంచదార... ఒక టీ.నిమ్మకాయ... ఒకటి జీలకర్ర... ఒక టీ.ఉప్పు... తగినంత కొబ్బరి తురుము... ఒక కప్పు తయారీ విధానం : చపాతీలను రాత్రిపూటనే తయారుచేసి ఒక హాట్ ప్యాక్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయాన్నే వాటిని తీసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్లను వేయించాలి. బాగా వేగిన తరువాత జీలకర్ర, సోంపు గింజలను, తురిమి ఉంచుకున్న పదార్థాలనువేసి వేయించాలి.ఆ తరువాత లెమన్ జ్యూస్, పంచదార, కొబ్బరి తురుమును కూడా చేర్చాలి. ముక్కలు చేసిన చపాతీలను ఈ మిశ్రమంలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి. అంతే క్యారెట్, కాలీఫ్లవర్, బీట్రూట్ తురుములతో తయారైన ఫ్రైడ్ చపాతీ రెడీ. దీనికి టమోటా సాస్, చిల్లీ సాస్‌లను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.